Thu Feb 05 2026 03:37:11 GMT+0000 (Coordinated Universal Time)
రాజీనామాపై కామినేని ఏమన్నారంటే?

తాము మరికాసేపట్లో మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగిన నేపథ్యంలో తాము కూడా ఏపీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. తమ రాజీనామాలను స్పీకర్ కు అందజేస్తామని, ఐదు నిమిషాలు తమ రాజీనామాలకు గల కారణాలను వివరించేందుకు అవకాశమివ్వాలని స్పీకర్ ను కోరతామని కామినేని చెప్పారు. టీడీపీ నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్న కామినేని తాను బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు.
- Tags
- కామినేని
Next Story
