Mon Apr 13 2026 04:32:14 GMT+0530 (India Standard Time)
రాజమౌళి సలహలు తీసుకోవడంపై జగన్ అభ్యంతరం

చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణంలో నాలుగేళ్లవుతున్నా ఇటుక కూడా పెట్టలేదని జగన్ తీవ్రంగా ఆరోపించారు. సినిమా వాళ్లతో రాజధానిని కట్టిస్తారా? అని ప్రశ్నించారు. ఒక విద్యార్థిని వేసిన ప్రశ్నకు జగన్ బదులిచ్చారు. తాను సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నానని, ఇంజినీర్లకు తెలియని నిర్మాణపనులు సినిమా డైరెక్టర్ రాజమౌళికి ఎలా తెలుస్తుందని ఆ విద్యార్థిని ప్రశ్నించారు. అందుకు జగన్ బదులిస్తూ తాను కూడా ఇదే ఫీలవుతున్నానన్నారు. సినిమా వాళ్లతో రాజధాని నిర్మాణంచేయాలని చూసే వారు చంద్రబాబు ఒక్కరే అని జగన్ అన్నారు. ఇందుకు జగన్ అభ్యంతరం తెలిపారు. కేవలం వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసమే రాజధాని నిర్మాణం చేపట్టకుండా జాప్యం చేస్తున్నారన్నారు. సినిమా వాళ్లతో రాజధాని నిర్మాణం చేపట్టడం విచారకరమన్న జగన్, చంద్రబాబు ఏపీ ప్రజలకు సినిమా చూపిస్తున్నారన్నారు.
- Tags
- రాజమౌళి జగన్
Next Story

