రాంగోపాల్ వర్మ కోరుకున్నదే జరుగుతుందే ..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నా అంటూ రాంగోపాల్ వర్మ ప్రకటించిన నాటి నుంచి ఆయన కి చేతికి నోటికి పూర్తి పని దొరికింది. ఈ సినిమా పై టిడిపి వర్గాలు కస్సు మనడం దానికి ప్రతిగా వర్మ ఫేస్ బుక్ వేదికగా తనను విమర్శించిన వారిపై చెలరేగడం రివాజుగా మారిపోయింది. తాజాగా టిడిపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్మకు టార్గెట్ గా మారిపోయారు. ఎన్టీఆర్ చిత్రం లక్ష్మీపార్వతి కోణంలో తీయడంపై మంత్రి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆయన చరిత్రలో చాలా కోణాలు ఉంటే రాజకీయ లబ్ధికోసమే ఈ చిత్రాన్ని వర్మ నిర్మిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి . ఆయనకు అంతే స్థాయిలో సమాధానాలు ఇస్తూ సెటైర్ల మీద సెటైర్లు విసిరారు వర్మ.
సోమిరెడ్డి ని హీరోగా చేయమన్న వర్మ ...
మాటకు మాట విసరడంలో రాంగోపాల్ వర్మ స్టైలే వేరు. సోమిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఎన్టీఆర్ హీరో పాత్రలో కావాలంటే ఆయన నటించవచ్చని ఆఫర్ ఇచ్చారు ఆర్జీవీ . మంత్రి రాజకీయ ప్రయోజనాలకోసం కాక దేనికోసం రాజకీయాల్లో కొనసాగుతున్నారో చెప్పాలని కోరారు వర్మ . ఎన్టీఆర్ కోసం తనకన్నా ఎవరికి ఎక్కువ తెలియదన్న ఆయన తో ఎక్కడైనా ఎప్పుడైనా చర్చించడానికి సిద్ధమని సవాల్ కూడా వర్మ విసిరారు. ఆయనకన్నా ఎన్టీఆర్ కోసం తనకే ఎక్కువ తెలుసన్నారు. సోమిరెడ్డి ఎన్టీఆర్ మంచం కింద దురారా లేక తలుపు చాటున నక్కారా అంటూ పరుష వ్యాఖ్యలే చేశారు ఆర్జీవీ.
అనిత రంగ ప్రవేశం ....
వర్మతో ఇప్పుడు టిడిపి ఎమ్యెల్యే అనిత సైతం యుద్ధానికి దిగారు. ఎన్టీఆర్ చిత్రాన్ని వక్రీకరించి తీస్తే సహించమని అనిత వర్మకు వార్నింగ్ ఇచ్చారు. దానిపై స్పందించిన వర్మ ఇలాంటి బెదిరింపులు విని విని విసిగెత్తిపోయా అంటూ స్పందించారు. ఇలా సినిమా రిలీజ్ కి ముందే ఉచిత ప్రచారం రాబట్టడంలో దిట్ట అయిన ఆర్జీవీ బుట్టలో టిడిపి నేతలు పడిపోయారు. రోగి కోరుకున్నది వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్న చందంగా రాంగోపాల్ వర్మ తనకు ఎలాంటి ప్రచారం అవసరమో అది అనుకున్న రేంజ్ లోనే ఆయనకు దక్కడం విశేషం.
- Tags
- రాంగోపాల్ వర్మ

