యోగీ సర్కార్ నిర్ణయంపై శివసేన ఆగ్రహం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో వంద అడుగుల రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు సిద్దమయ్యారు. ఉత్తరప్రదేశ్ ను మత పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు యోగి ఆదిత్యానాధ్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా అయోధ్యను ఆనుకుని ఉన్న సరయూ నది ఒడ్డున వంద అడుగల రాముడి విగ్రహాన్ని నిర్మించడానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. దీనికి యూపీ గవర్నర్ రామ్ నాయక్ కూడా ఆమోదం తెలిపారు. అయోధ్యలో వంద అడుగుల రాముడి విగ్రహాన్ని నిర్మించాలన్న యోగి నిర్ణయాన్ని బీజేపీ మిత్ర పక్షాలు అభ్యంతరం చేస్తుండగా విపక్షాలు తప్పుపడుతున్నాయి.
విగ్రహమెందుకు? మందిర నిర్మాణం ఊసేదీ?
అయోధ్యలోని వివాదాస్పద మందిరంలో రాముడి గుడిని నిర్మించాల్సి ఉంటే.... కొత్తగా వంద అడుగుల విగ్రహం నిర్మాణం పేరిట ప్రజల దృష్టిని మరలుస్తున్నారని ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన ఆగ్రహం వ్యక్తంచేసింది. రామ మందిరాన్ని పక్క దోవ పట్టించేందుకే యోగి సర్కార్ విగ్రహం ప్రతిపాదనను కొత్తగా తెరమీదకు తెచ్చారని శివసేన దుయ్యబట్టింది. శివసేన గత కొద్దిరోజులుగా బీజేపీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. బుల్లెట్ ట్రయిన్ ఎవరికి కావాలని? పెట్రోలు ధరలు తగ్గించి సామాన్యులను కష్టాల నుంచి గట్టెక్కించాలని శివసేన డిమాండ్ చేసింది. అలాగే మోడీ తీసుకుంటున్న ప్రతినిర్ణయాన్ని శివసేన తప్పుపడుతుంది. తాజాగా యోగి ప్రభుత్వం ప్రతిపాదించిన రాముడి వంద అడుగుల విగ్రహంపైన కూడా శివసేన నెగిటివ్ కామెంట్లు చేసింది.
- Tags
- యోగి ఆదిత్యనాధ్

