యోగి ఇందులో సక్సెస్ అవుతారా?

యుపి సీఎం యోగి ఆదిత్యనాధ్ తన పదవీకాలంలోగా సుదీర్ఘకాల సమస్యగా వున్న రామమందిర నిర్మాణం చేసి తీరాలన్న సంకల్పంతో వున్నారు. ఆయన సీఎం అయిన నాటినుంచి ఏదో ఒక రకంగా అందరిని ఒప్పించి దేశ వాసుల ప్రశంసలు అందుకోవాలని తహతహ లాడుతున్నారు. ఆ దిశగా ఆయన చేయని ప్రయత్నం లేదు. తాజాగా ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అధినేత ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ను సీన్ లోకి తెచ్చారు ఆదిత్యానాధ్.
మధ్యవర్తిత్వం చేస్తా అంటున్న రవిశంకర్ ...
అన్ని వర్గాలను కలిసి ఈ సుదీర్ఘ సమస్యకు పరిష్కారం చేసి తీరతా అంటూ రవిశంకర్ రంగంలోకి దిగారు. తాజాగా ఆయన ఆదిత్యనాధ్ ను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. అయోధ్య అంశంలో మిళితమైన అన్ని వర్గాలను స్వయంగా వెళ్ళి వారిని ఒప్పించే పనిని రవిశంకర్ కు యుపి సీఎం అప్పగించారు. రవిశంకర్ ఈ భాధ్యతను ఇప్పుడు భుజానకెత్తుకుని బయల్దేరారు.
రవిశంకర్ దౌత్యానికి నో చెప్పిన ముస్లిం సంఘాలు ...
రవిశంకర్ మధ్యవత్తిత్వాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు అంగీకరించడం లేదు. ఈ వివాదం కోర్ట్ లో ఉండగా ఆయన ఎవరు దీనిని పరిష్కరించడానికి అనే ప్రశ్న లేవనెత్తింది. యోగి ఆదిత్యనాధ్ తో రవిశంకర్ భేటీ అయిన సమయంలోనే ముస్లిం లా బోర్డు బృందం కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ ను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేయడం విశేషం. దాంతో ఇప్పుడు రవిశంకర్ దౌత్యం దాదాపుగా ఎవరూ అంగీకరించరని తేలడంతో యోగి మరో మార్గం వెతికే పనిలో పడతారా ? లేక ఆయననే నమ్ముకుంటారో చూడాలి.
- Tags
- యోగి ఆదిత్యానాధ్

