Thu Dec 25 2025 19:19:55 GMT+0000 (Coordinated Universal Time)
యూపీ లో ముసలం ఇంకా ముగియలేదండోయ్

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లో ,పాలక కుటుంబంలో పుట్టిన ముసలం ముగిసిపోయిందని అనుకున్నది నిన్నటి వార్త. అయితే.. ఇంకా సమస్య సజీవంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఎన్నికలకు వెళ్ళే వాతావరణం కనిపిస్తోంది. కొన్ని రోజులుగా అనూహ్యంగా వ్యవహరిస్తున్న అఖిలేష్, బుధవారం తను వెళ్లి గవర్నర్ ను కలవడం చర్చనీయాంశంగా మారుతోంది.
బాబాయి శివపాల్ యాదవ్ తో విభేదాల తరువాత తండ్రి చేసిన రాజీ చర్చలతో అంతా సద్దుమణిగిందని అందరు అనుకున్నారు. కానీ ఆ సయోధ్య నీటి బుడగ లాంటిది అని తేలిపోయింది. ఒక్కరోజు వ్యవధిలోనే బుడుంగు మని పేలిపోయింది. అఖిలేష్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మధ్యంతర ఎన్నికలకు వెళితే గనుక... రాష్ట్రంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.
Next Story

