Thu Mar 26 2026 08:49:08 GMT+0530 (India Standard Time)
మోడీని విజయసాయి కలిస్తే తప్పేంటి?

ప్రధాని మోడీని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కలవడాన్ని కొందరు తప్పుపడుతున్నారని, అందులో తప్పేముందని ఏపీ బీజీపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ఏ2 నిందితుడు విజయసాయి రెడ్డి ప్రధాని మోడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఇటీవల టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై హరిబాబు స్పందిస్తూ ఒక ఎంపీగా విజయసాయి రెడ్డి ప్రధానిని కలవడంలో ఎటువంటి తప్పు లేదన్నారు. ఎంపీలకు ప్రధానిని కలుసుకునే హక్కు ఉంటుందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ప్రధాని గౌరవిస్తారని చెప్పారు.
Next Story

