మోడీని బోల్తా కొట్టించారే?

నోట్ల రద్దు తో నల్లధనం పాములు బయట పడతాయని భావించింది మోడీ సర్కార్. కానీ 99 శాతం నగదు బ్యాంక్ లకు చేరడంతో ఆ ప్రయోగం విఫలం అయ్యిందని దేశంలో అంతా తిట్టిపోశారు బిజెపి వారిని. వాస్తవానికి అక్రమార్కులు బ్లాక్ మనీని బంగారం, వజ్రాలు గా మార్చినట్లు దేశవ్యాప్తంగా అవినీతి పరులపై సిబిఐ , ఎసిబి , ఇన్ కం టాక్స్ , విజిలెన్స్ వంటి సంస్థలు జరుపుతున్న దాడులు తేటతెల్లం చేస్తున్నాయి. బంగారు దుకాణాల నుంచి బ్యాంక్ లకు చక్కగా రాజమార్గంలో క్యాష్ జమయిపోయింది . మరికొందరు డాలర్స్ ను బ్లాక్ లో కొని మరీ సేఫ్ అయిపోయారు. దీనికి సంబంధించి ఏపీలో జరిగిన ఇద్దరి అధికారుల అక్రమాస్తుల వ్యవహారమే సాక్ష్యంగా నిలుస్తుంది.
పాండురంగ, రఘుల కేసుతో ...
ప్రజారోగ్య శాఖా అధికారి పాము పాండురంగారావు , టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి రఘు అక్రమాస్తుల వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎసిబికి వీరిద్దరి భాగోతం విస్మయ పరిచింది. ఈ అధికారులు నోట్ల రద్దు తరువాత భారీ ఎత్తున వజ్రాలు నగలు కొనిపారేశారు. ముఖ్యంగా రఘు ఆయన బినామీ గాయత్రి పేరిట నగదు ను నగలుగా మార్చినట్లు అధికారులు కనుగొన్నారు. మోడీ పాత నోట్లు రద్దు ప్రకటన చేయగానే విజయవాడ లోని బడా జ్యుయలరీ షాప్ లతో మాట్లాడుకుని ఈ వ్యవహారం రఘు సాఫీ గా నడిపారు . ప్రస్తుతం ఇలా ఒకరిద్దరు లేదా కొన్ని అవినీతి చేపలే కోట్ల కొద్ది డబ్బు బంగారంగా మార్చుకుంటే ప్రభుత్వ శాఖల్లో వున్న అక్రమార్కులు , వ్యాపార రంగంలో వున్న వారు ఇదే రూట్ లో లెక్క చూపని నగదును దర్జాగా మార్చేసినట్లు అర్ధమౌతుంది .
- Tags
- నల్లధనం

