Fri Dec 05 2025 21:12:42 GMT+0000 (Coordinated Universal Time)
మోడీకి భయపడేది లేదు

ప్రధాని నరేంద్ర మోడీపై తాను జరుపుతున్న పోరాటంలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తాను ఎవరికీ భయపడనని, భయపడబోనని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో అశోక్ లేల్యాండ్ వాహనాల తయారీ కంపెనీకి ఆయన శంకుస్థాపనచేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు గత ఎన్నికలలో ఎలాంటి గతి పట్టిందో...వచ్చే ఎన్నికల్లోబీజేపీకి కూడా అదే గతి పడుతుందని చంద్రబాబు హెచ్చరించారు. తనపై ఎదురుదాడి చేసినా బెదిరేది లేదని, తనకు ఎ అంటే అమరావతి అని, పి పోలవరం అని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తి చేయడమే తన లక్ష్యమని ఆయన వివరించారు.
Next Story
