Fri Mar 27 2026 10:29:05 GMT+0530 (India Standard Time)
మోడీకి ఫోన్లో చెప్పాలని....

కేంద్రమంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నందున కర్టెసీగా ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళదామనుకున్నానని చంద్రబాబు చెప్పారు. తాను ప్రధాని మోడీకి ఫోన్ చేసినా ఆయనతో మాట్లాడటం సాధ్యం కాలేదన్నారు. తన ఓఎస్డీ ప్రధాని ఓఎస్డీతో కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారన్నారు. తాను రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర కేబినెట్ లో చేరామని, అయితే ఆ ప్రయోజనాలు నెరవేరనప్పుడు అందులో ఉండటం వృధా అనుకుని కేబినెట్ నుంచి బయటకు వచ్చామన్నారు. తమ మంత్రుల రాజీనామా తర్వాత కేంద్రం నుంచి వచ్చే స్పందన చూసి మిగిలిన నిర్ణయాలను తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
- Tags
- మోడీ చంద్రబాబు
Next Story

