Mon Mar 30 2026 00:19:48 GMT+0530 (India Standard Time)
మోడీ సభకు వచ్చినా...?

లోక్ సభకు ప్రధాని మోడీ చేరుకోవడంతో టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసనను మరింత పెంచారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో పార్లమెంటు దద్దరిల్లింది. ఎంపీలు తమ స్థానాలకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించారు. అయినా టీడీపీ ఎంపీలు వినడం లేదు. స్పీకర్ ఎంత వారించినా టీడీపీ ఎంపీలు తమ నిరసనను ఆపలేదు. మోడీ ప్రసంగం ప్రారంభించడానికి లేచి నిలబడినా ఎంపీలు తమ నినాదాలను ఆపలేదు. కేంద్రమంత్రులు వినతినీ ఎంపీలు పట్టించుకోలేదు. విభజన హామీలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. నినాదాల మధ్యనే మోడీ ప్రసంగిస్తున్నారు.
- Tags
- మోడీ
Next Story

