మోడీ మొండి నిర్ణయాలకు షాక్

కమలం పార్టీ కాపు కాచే నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. మోడీ, షాల పై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కన్పించింది. మహారాష్ట్రలోని నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ తగిలిందనే చెప్పాలి. నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం మూడంటే మూడే సీట్లు రావడం విశేషం. మొత్తం 54 స్థానాలకు ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే అందులో బీజేపీకి మూడు దక్కగా కాంగ్రెస్ పార్టీ 49 స్థానాల్లో నిలిచి విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ కు ఇది ఎంతో ఊరట ఇచ్చే అంశం గానే చెప్పుకోవచ్చు. మరోవైపు ఇదే ఎన్నికల్లో శివసేన కేవలం ఒక్క స్థానానికే పరిమితమవ్వడం విశేషం.
అడ్డగోలు నిర్ణయాల వల్లనేనా?
నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేశాయనే చెప్పొచ్చు. ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలను ప్రజలు ఎలా తిరస్కరిస్తారో నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. పెట్రోలు, డీజిల్ రేట్ల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, మహారాష్ట్రలో రైతుల ఆక్రందనలు వెరసి మోడీ సర్కార్ కు ఈ ఎన్నికలకు తగిన గుణపాఠమే చెప్పాయి. నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఆశించిన ఫలితం రాలేదు. దీనిపై బీజేపీ అగ్రనేతలు పోస్ట్ మార్టం చేస్తున్నారు. మరోవైపు అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎంను కూడాప్రజలు పక్కన పెట్టేశారు. గతంలో 11 స్థానాలున్న ఎంఐఎంకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కక పోవడం విశేషం.
- Tags
- మోడీ

