మోడీ తో చంద్రబాబు అపాయింట్ మెంట్ వెనుక ఈయనున్నారా...?

సిపిఐ నారాయణ ఏమి చేసిన సంచలనం. ఎప్పుడు వార్తల్లో వుండే నారాయణ తాజాగా పోరుబాట పట్టారు. అమరావతి వచ్చిన నారాయణ సైకిల్ పై వెళ్ళి హల్చల్ సృష్ట్టించారు. అసెంబ్లీ , సచివాలయం భవనాలు చూసి చంద్రబాబు పనితీరు శభాష్ అన్నారు. అయితే అనుమతి లేకుండా రావడంతో నారాయణను సెక్యూరిటీ లోపలి కి అనుమతించలేదు. ప్రధాని పార్లమెంట్ మట్టి అంటూ ప్రజల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని ని చంద్రబాబు, జగన్ మోడీ కి తలవొగ్గకుండా అవసరమైతే ఇద్దరు జైలుకి పోవడానికైనా సిద్ధం కావాలని సూచించారు. దానివల్ల ఐదారు నెలలు జైల్లో ఇద్దరు వున్నా రాష్ట్రానికి వచ్చే ప్రమాదం లేదని చెప్పారు.
నేనే కలిపానంటున్న నారాయణ....
పోలవరం ఏడాదికాలంగా ఎప్పుడెప్పుడా అని పొలిటికల్ పండితులంతా ఆసక్తిగా ఎదురుచూసిన మోడీ చంద్రబాబు భేటీ ఏర్పాటైంది. అయితే ప్రధాని ఏపీ సీఎం లను కలిపింది నేనే అంటున్నారు సిపిఐ నారాయణ. అదేమిటి అంటే దానికి ఉదాహరణలు చెప్పుకొచ్చారు ఆయన. తాను తమ పార్టీ నేత రాజా ప్రధాని నరేంద్ర మోడీని ఇటీవల కలిసి ఏపీ దుస్థితి వివరించామని చెప్పారు. విభజన తరువాత ఏపీ దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తక్షణం కేంద్రం జోక్యం చేసుకుని ఆర్ధికంగా ఆదుకోవాలని కోరానని, అన్నారు . పోలవరం ప్రాజెక్ట్ విభజన సమస్యలు చర్చించామని వెల్లడించారు. దానికి ప్రధాని సానుకూలంగా స్పందించే ఏపీ సీఎం చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇచ్చారన్నది నారాయణ చెప్పిన చిదంబర రహస్యం.
- Tags
- నారాయణ

