Sun Mar 29 2026 04:14:27 GMT+0530 (India Standard Time)
మైకులో చెప్పగానే వెళ్లాలా అన్న వైసీపీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నుంచి తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మైకులో పిలవగానే ఆ మీటింగ్ కు వెళ్లాలా? అని బొత్స ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ మిత్రపక్షంగానే వ్యవహరిస్తున్నారని, ఆయన దాన్నుంచి బయటకు వచ్చినట్లు ఎక్కడా చెప్పలేదని నాని అన్నారు. కాబట్టి తాము ప్యాకేజీని వ్యతిరేకిస్తున్నామని, ప్రత్యేక హోదాను మాత్రమే డిమాండ్ చేస్తామన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని వైసీపీ నేతలు అన్నారు.
- Tags
- వైసీపీ
Next Story

