Fri Apr 03 2026 04:08:54 GMT+0530 (India Standard Time)
మెట్రోకు అదిరిపోయే రెస్పాన్స్

హైదరాబాద్ మెట్రో సక్సెస్ అయింది. హైదరాబాద్ లో మెట్రో సేవలు ప్రారంభమై నెల రోజులయింది. ఈ నెల రోజుల్లో మెట్రో సర్వీసుల్లో 32.50 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అంటే రోజుకు లక్ష మందికి పైగానే మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. గత నెలలోనే ప్రధాని మోడీ మెట్రో సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక మెట్రో స్మార్ట్ కార్డులను కూడా లక్షన్నర మంది కొనుగోలు చేశారు. ఇవన్నీ జాయ్ రైడ్లు కావని, నిత్యం ప్రయాణించే వారే రోజుకు లక్ష మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పార్కింగ్ సమస్య మెట్రో స్టేషన్లలో ఉన్నట్లు గుర్తించామని, ఇందుకోసం టెండర్లు పిలిచామని అధికారులు చెప్పారు. మిగిలిన సర్వీస్ లను కూడా ప్రారంభిస్తే హైదరాబాదీలు మెట్రోసర్వీసులను విరివిగా వాడుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
- Tags
- మెట్రో
Next Story

