Fri Mar 27 2026 14:12:26 GMT+0530 (India Standard Time)
మూడో రోజూ 30 సెక్లనకే

తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆందోళనతో మూడోరోజూ ప్రారంభమైన ముప్ఫయి సెకన్లకే లోక్ సభ వాయిదా పడింది. బుధవారం సభప్రారంభం కాగానే తెలుగుదేశం, వైసీపీ పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా తెలుగు ఎంపీలు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వాయిదా వేశారు. మూడోరోజు కూడా టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో వేడి పుట్టించారు.
Next Story

