మీరు సిద్ధమా...? నేను సిద్ధం.....!

వైసీపీ అధినేత జగన్ టీడీపీ, జనసేనలకు సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న జగన్, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని కోరారు. టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినా వైసీపీ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుందన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వల్ల ఏపీకి ఒనగూరే ప్రయోజనమేదీ లేదన్నారు. పవన్ గారూ మీరైనా చంద్రబాబుకు సలహా ఇచ్చి ఎంపీలచేత రాజీనామాలు చేసేలా చూడండన్నారు. ఎవరు సలహా ఇచ్చినా స్వీకరిస్తామని జగన్ చెప్పారు. అవిశ్వాసం పెట్టాలన్న పవన్ ప్రతిపాదనను తాను స్వాగతిస్తున్నానని, అందుకు చంద్రబాబును కూడా ఒప్పించాలని కోరారు. తాను దేనికైనా సిద్ధమని..అందుకు మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం పవన్, చంద్రబాబు పోరాడాలని జగన్ కోరారు.
- Tags
- జగన్

