Wed Mar 25 2026 17:25:54 GMT+0530 (India Standard Time)
మాయా పూర్తి క్లారిటీతో ఉన్నారే

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పూర్తి స్పష్టతతో ఉన్నట్లు కన్పిస్తోంది. రాజ్యసభ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థి ఓటమి పాలవ్వడంతో ఆ ప్రభావం సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మైత్రిపై పడుతుందని అందరూ ఆశించారు. కాని మాయావతి మాత్రం దీనిపై స్పష్టమైన ప్రకటనచేశారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎస్పీ, బీఎస్పీల పొత్తుపై ఏమాత్రం ఉండబోదని మాయావతి చెప్పారు. భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు. అలాగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన బీఎస్పీ ఎమ్మెల్యేలపై మాయావతి చర్యలకు దిగనున్నారు. ఇప్పటికే బీజేపీకి ఓటేశారన్న కారణంగా అనిల్ కుమార్ పై వేటు వేయనున్నట్లు చెబుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయని మాయా ప్రకటించడం విశేషం.
Next Story

