Thu Mar 26 2026 02:23:59 GMT+0530 (India Standard Time)
మాటలను వక్రీకరించారన్న పవన్

తన మాటలను మీడియా ప్రతినిధులు తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా వల్ల ఏమీ రాదని తాను అన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని జనసేనాని ట్వీట్ చేశారు. చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులు, ఎక్పైజ్ సుంకం రానప్పుడు ప్రత్యేక హోదాతో ఉపయోగమేంటని మాత్రమే తాను ప్రశ్నించానన్నారు. ఏపీకి నిధులు, హోదా రెండూ కావాల్సిందేనని చెప్పారు. ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన ఏపీకి తక్షణ సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పవన్ చెప్పారు. పత్రికలు వక్రీకరించినట్లుగా తాను ప్రత్యేకహోదాపై మాట మార్చలేదని ఆయన చెప్పారు.
- Tags
- పవన్ కల్యాణ్
Next Story

