Sat Apr 11 2026 03:44:00 GMT+0530 (India Standard Time)
మాజీ సీఎంపై రాళ్ల వర్షం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు చేదు అనుభవం ఎదురయింది. బీజేపీ కర్ణాటకలో బలపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేతృత్వంలో నవ కర్ణాటక పరివర్తన యాత్ర మొన్న ప్రారభమైంది. ఈ యాత్ర కర్ణాటక మొత్తం తిరుగుతుంది. అయితే శనివారం యడ్యూరప్ప పరివర్తన యాత్రలో ఉండగా కొందరు బీజేపీ శ్రేణులే ఆయన వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. కొంతకాలం క్రితం చౌదరి నగేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నగేష్ అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ రాళ్ల దాడి నుంచి యడ్యూరప్ప తప్పించుకున్నారు.
- Tags
- యడ్యూరప్ప
Next Story

