Sun Apr 12 2026 03:18:20 GMT+0530 (India Standard Time)
మళ్లీ చిక్కుల్లో చింతమనేని

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరుకాలనీ మహిళలు చింతమనేని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పేరుతో తమ కాలనీకి వచ్చి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమపై దౌర్జన్యం చేశారని ఏలూరు మండలం లింగారావు గూడేనికి చెందిన మహిళలు ఈ ఫిర్యాదు చేశారు. తాము సమస్యలను గురించి ప్రస్తావిస్తే ఎమ్మెల్యేతో పాటు, ఆయన అనుచరులు తమపై దౌర్జన్యానికి దిగారని మహిళలు ఆరోపిస్తున్నారు. దెందులూరు పోలీసులు ఈ మేరకు ఎమ్మెల్యే చింతమనేని పై కేసు నమోదు చేశారు.
Next Story

