మరోసారి ఇక్కడ జగన్ జట్టు గెలుస్తుందా?

మార్కాపురం నియోజకవర్గం టీడీపీకి అసలు కలిసి రాలేదు. 1955లో మార్కాపురం నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి టీడీపీకి ఒక్కసారి తప్ప ఇక్కడ విజయం దక్కలేదు. మొత్తం 13 సార్లు జరిగిన మార్కాపురం నియోజకవర్గం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2009లోనే విజయం సాధించింది. మిగిలిన పన్నెండు సార్లు స్వతంత్రులు, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే విజయం సాధించాయి. గత ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ అభ్యర్థి జంకె వెంకటరెడ్డి తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై దాదాపు పదివేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
పూర్తిగా వెనుకబడిన ప్రాంతం....
జగన్ ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక్క కేపీ కొండారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మూడుసార్లు విజయం సాధించగా, వైసీపీ అభ్యర్థి జంకె వెంకటరెడ్డి ఒకసారి స్వతంత్ర అభ్యర్ధిగా, ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా గెలుపొందడం విశేషం. మిగిలిన వారు ఒక్కసారి మాత్రమే గెలిచి రాజకీయంగా కూడా తెరమరుగయ్యారు. ఇప్పుడు మరోసారి మార్కాపురం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలన్నది జగన్ ప్రయత్నం. మార్కాపురం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. నీటిసమస్యతో, నిత్యం కరువు కాటకాలతో అల్లాడి పోతుంటుంది. పలకల పరిశ్రమకు ప్రసిద్ధి.
చంద్రబాబు పై నిప్పులు....
అయితే జగన్ పాదయాత్రకు ఈ నియోజకవర్గంలో మంచి స్పందన కన్పిస్తోంది. పొదిలి పట్టణంలో ఏర్పాటు చేసిన సభకు జనం పెద్దయెత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ విశాఖ పెట్టుబడుల సదస్సులో ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై ధ్వజమెత్తారు. చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. గతంలో ప్రభుత్వం నిర్మహించిన రెండు సమ్మిట్ లకు పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెప్పారని, లక్ష ఉద్యోగాలు వచ్చాయన్నారని, మరి అవి కనపడటం లేదే? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకామరే రెండేళ్లలో రాష్ట్రానికి కేవలం ఏడాదికి ఐదు వేల కోట్ల పెట్టుబడులే వచ్చాయని చెబతుంటే చంద్రబాబు మాత్రం లక్షల కోట్లు వచ్చాయంటూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.
జగన్ @ 99....
ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర 99వ రోజు ప్రజాసంకల్ప యాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం పొదిలి శివార్లలో బస చేసిన ప్రాంతం నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కాటూరి వారిపాలెం, అగ్రహారం, అన్నారం క్రాస్ రోడ్స్, తలమళ్ల, ఫిర్దోస్ నగర్, గోగినేని పాలెం క్రాస్ రోడ్స్ మీదుగా ఉప్పలపాడు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పలపాడులోనే జగన్ రాత్రి బస చేయనున్నారు. నిన్న జగన్ మొత్తం 13.5 కిలోమీటర్లు నడిచినట్లు వైసీపీ పార్టీ కార్యాలయం తెలిపింది. ఇప్పటి వరకూ జగన్ 13.23.8 కిలోమీటర్ల దూరం జగన్ ప్రయాణం చేశారు.
- Tags
- జగన్ పాదయాత్ర

