మరో షాక్ ఇచ్చిన రేవంత్

తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాను పార్టీ మారతాను అని ఎవరితో చెప్పానని ప్రకటించిన రేవంత్ కొత్త చర్చ కు తెరతీశారు. తన నియోజకవర్గం కొడంగల్ లో కార్యకర్తలు సమావేశం నిర్వహించిన రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారతానని ఎవరికి చెప్పానంటూ ప్రశ్నలు వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అలాగే తాను నియోజకవర్గం మారుతానంటూ కొన్ని తప్పుడు పత్రికలు, ఛానెల్స్ ప్రచారం చేస్తున్నాయి అది పూర్తిగా అవాస్తవమని రేవంత్ అన్నారు. సోనియా గాంధీకి అమేథి, చంద్రబాబుకి కుప్పం ఎలాగో కొడంగల్ తనకు అటువంటిదన్నారు ఆయన. చంద్రబాబు ప్రస్తుతం విదేశాల్లో వున్నారని ఆయన వచ్చాకా తెలుస్తా అని ఈ లోగా వస్తున్న వార్తలు తనను మనోవేదనకు గురిచేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి.
స్పష్టంగా చెప్పడం లేదంటున్న రమణ...
రేవంత్ పార్టీ మారడం లేదని స్పష్టంగా ప్రకటించడం లేదంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు టి టిడిపి అధ్యక్షుడు రమణ. ఒక పక్క కాంగ్రెస్ నేతలను కలుస్తూ వున్నారు , మరో పక్క వారు ఆహ్వానిస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే ఏమి లేదంటే ఎలా నమ్ముతామంటున్నారు ఆయన. ఒక పక్క రేవంత్ వ్యాఖ్యలు మరో పక్క టిడిపి నేతల మాటలు చూస్తుంటే చంద్రబాబు అడుగు పెట్టె వరకు పంచాయితీ నడిచేలాగే వ్యవహారం వుంది.
రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ..?
మైండ్ గేమ్ కి పెట్టింది పేరు టిడిపి. ఇప్పుడు టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సొంత పార్టీతోనే మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పటినుంచి రేవంత్ ఆడుతున్న మైండ్ గేమ్ కి టిటిడిపి తో పాటు ఏపీ టిడిపి ఖంగు తింది. రెండు రోజుల పాటు ఆ పార్టీకి ఏ వ్యూహాన్ని అనుసరించాలో అర్ధం కానీ పరిస్థితి ఎదురైంది. తాజాగా మళ్ళీ పార్టీ చేంజ్ అవుతా అని ఎవరు చెప్పారంటూ రేవంత్ వేసిన బాణానికి టిడిపి ఇంకా క్లారిటీకి రాలేకపోతుంది. తెగేదాకా లాగాలన్న వ్యూహంలో భాగంగానే రేవంత్ ఈ ఎత్తుగడ అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- రేవంత్ రెడ్డి

