Wed Mar 25 2026 17:25:54 GMT+0530 (India Standard Time)
మన్మోహన్ ఫొటో మోడీ పెట్టారా?

తాము ప్రధాని మోడీ ఫొటోలను పెట్టడం లేదని పదే పదే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, అయితే ప్రధాని మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫొటో పెట్టారా? అని చంద్రబాబు నిలదీశారు. మన్మోహన్ ఫొటో పెట్టుకున్నామని చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలను ఢిల్లీలో ఉండి నియంత్రించాలనుకుంటే కుదరదని చెప్పారు. తమ ప్రాంత ప్రజలు కట్టే పన్నులు తీసుకుంటూ తమకు తిరిగి ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకని ఆయన నిలదీశారు. మోడీ ఫొటోలను పెట్టలేదని ఇంత రాద్ధాంతం చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story

