Mon Apr 13 2026 03:04:33 GMT+0530 (India Standard Time)
మంత్రి తలసానికి తప్పిన ఘోర ప్రమాదం

రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొంది. అయితే... వాహనం దెబ్బతిన్నప్పటికీ మంత్రికి మాత్రం ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఈ సంఘటన జరిగింది. కాగా... మంత్రి వాహనంలోనే ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కీసరలో నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Tags
- మంత్రి తలసాని
Next Story

