Wed Mar 25 2026 01:29:55 GMT+0530 (India Standard Time)
మంత్రి అయ్యన్న రాజీనామా హెచ్చరిక

ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు రాజీనామా హెచ్చరికలు జారీచేశారు. తాను చెప్పిన వారికి కాకుండా జిల్లా లైవ్ స్టాక్ కమిటీని నియమించడంపై ఆయన కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పై మంత్రి అయ్యన్న సీరియస్ అయ్యారు. అయితే దీనికి కలెక్టర్ తనకు సంబంధం లేకుండానే నియామకాలు జరిగాయని వివరణ ఇచ్చుకున్నారు. సాయంత్రంలోగా కమిటీలు మార్చకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ విషయాన్ని మంత్రి అయ్యన్న జిల్లా ఇన్ ఛార్జి మంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం మీద అయ్యన్న రాజీనామా ప్రకటన పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సంచలనమే అయింది.
Next Story

