Mon Apr 06 2026 00:57:57 GMT+0530 (India Standard Time)
మంత్రి అఖిలప్రియపై పవన్ మండిపాటు

మంత్రి అఖిలప్రియపై పవన్ మండిపడ్డారు. బోటు ప్రమాదానికి మంత్రి అఖిలప్రియ బాధ్యత వహించాలన్నారు. కేవలం ఎక్స్ గ్రేషియో ప్రకటించినంత మాత్రాన ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. భూమా కుటుంబం వైసీపీ ఎమ్మెల్యేలుగా నిలబడినప్పుడు తనను ప్రచారానికి రావద్దని కోరారని, తాను వస్తే ఓట్లు పోతాయని వారు చెప్పడంతో తాను వెళ్లలేదన్నారు. అలాగే ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా తాను మానవతా థృక్ఫథంతోనే అభ్యర్థిని నిలబెట్టలేదని చెప్పారు. రెండుసార్లు అఖిలప్రియ కుటుంబానికి సాయం చేశానన్నారు. అలాంటి మీకు మానవతా థృక్ఫథం కొరవడిందన్నారు. విచ్చలవిడిగా ప్రయివేటు బోట్లు తిరుగుతుంటే, లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా నదిలోకి తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
- Tags
- మంత్రి అఖిలప్రియ
Next Story

