భాషా హిమాలయాలకు...ఎందుకంటే?

మనసు బాగోపోతే తలైవా హిమాలయాలకు వెళ్ళి రీఛార్జ్ అయ్యి రిఫ్రెష్ గా వస్తారు . ఇప్పుడు ఆయన వత్తిడిలో వున్నారు . తమిళ రాజకీయాల్లో వ్యాక్యూమ్ బాగా ఉందని పార్టీ పెట్టి దుమ్ము దులుపుదామని అనుకున్న రజనీకాంత్ కి కమల్ హాసన్ రూపంలో కొత్త చికాకు ఎదురైంది . రజని కన్నా ముందే పార్టీ ప్రకటించి పొలిటికల్ స్క్రీన్ పై తకిట తధిమి తందానా అని డాన్స్ మొదలెట్టేశాడు కమల్ హాసన్. అంతటితో ఆగాడా ఆయన రజనిని పదే పదే కామెంట్ చేస్తూ మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. దాంతో రజనికి ప్రశాంతత లేకుండా పోయింది.
వచ్చాకే కీలక నిర్ణయం ...?
రజనీకాంత్ హిమాలయాలకు వెళ్ళి ఏమి చేస్తారు ..? అందరికి తెలిసిందే ఆయన అక్కడ ధ్యానం చేసుకుంటారు. అలా చేశాక ఆయన మనస్సు కుదుట పడుతుంది. అప్పుడు ప్రశాంత చిత్తంతో తన రాజకీయ భవితపై ప్రకటన చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఆయన సన్నిహితులు. తమిళనాడులో రాజకీయాలకు , సినీ తారలకు విడదీయలేని బంధం వుందన్నది తెలిసిందే. ప్రస్తుతం సాంబారు పాలిటిక్స్ ఘాటుగా నడుస్తున్నాయి. అందరి ఫోకస్ పూర్తిగా రజినీపై పడింది . ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని ఆయన తీసుకోబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి లో రజని రాజకీయ అరంగేట్రాన్ని అంతా ఊహిస్తున్నారు . ఈలోగా రాజకీయ గందరగోళం లో వుండే కన్నా ప్రశాంతంగా హిమాలయాల్లో గడిపి వివాదాలకు దూరంగా ఉందామని భావించే చలో హిమాలయాస్ అని తమిళ సూపర్ స్టార్ చెక్కేశారు అంటున్నారు. చూడాలి వచ్చాకా భాషా ఏమి చేస్తారో .
- Tags
- రజనీకాంత్

