Fri Apr 10 2026 15:02:45 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హైదరాబాద్ లో కాల్పులు

హైదరాబాద్ లో కాల్పులు జరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చోటు చేసుకున్న ఈ విభేదాలే కాల్పులకు కారణంగా తెలుస్తోంది. మైలార్ దేవ్ పల్లి మండలంలోని ఒక ఫాం హౌస్ లో ఈరోజు ఉదయం కాల్పులు జరిగాయి. కింగ్స్ కాలనీకిచెందిన ముస్తాఫా అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల సంఘటనలో తీవ్రంగా గాయపడిన ముస్తాఫాను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భూ వివాదాల కారణంగానే కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

