Fri Mar 27 2026 07:25:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

సమాజంలోని అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా ఏపీ బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక మంత్ిర యనమల తెలిపారు. న్యాయశాఖకు 886కోట్లు, హోంశాఖకు 6226కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి నిధులు సకాలంలో రాక ఇబ్బందులు పడ్డామన్నారు యనమల. సంక్షేమరంగానికి 13..720 కోట్లను కేటాయించారు. వివిధ రంగాలకు చెందిన వారి జీవనోపాధికి, నైపుణ్యం పెంచడానికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లు చెప్పారు. కాపు సామాజిక విద్యార్థుల సంక్షేమం కోసం 750 కోట్లు కేటాయించారు. ఏపీ వెనుకబడిన తరగతుల సంస్థకు వంద కోట్లు కేటాయించినట్లు యనమల తెలిపారు.
Next Story

