Wed Mar 25 2026 17:29:22 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : షాకు లోకేష్ కౌంటరిదే

రాష్ట్ర సమస్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అవగాహన లేదని మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా రాసిన లేఖతోనే ఆ విషయం స్పష్టమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్లు పంపుతున్న విషయం ఆయనకు తెలీదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలను అమలు పర్చడానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్ అవసరమా? అని ఎద్దేవా చేశారు. తమది ఆవేశ పూరిత నిర్ణయం కాదని, ఆలోచించే ఎన్డీఏ నుంచి వైదొలిగామని చెప్పారు. అనేక సార్లు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. త్వరలోనే తాము పూర్తి వివరాలతో అమిత్ షాకు లేఖ రాయనున్నట్లు లోకేష్ తెలిపారు.
Next Story

