Wed Apr 01 2026 01:29:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీకి మరో పెద్ద షాక్....!

వైసీపీ కి మరో షాక్ తగిలింది. విజయవాడ నేత వంగవీటి రాధావైసీపీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ నెల 22న టీడీపీ లో రాధా చేరనున్నారు. జగన్ సీటు కన్ఫర్మ్ చేయక పోవడం, 2019 లో వైసీపీ అధికారం లోకి రాదని రాధా తన అనుచరులతో చెప్పారు. ముఖ్యమంత్రి హామీతో టీడీపీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మల్లాది విష్ణు కి సెంట్రల్, వెల్లంపల్లి కి తూర్పు, యలమంచిలి రవి ని పార్టీ లోకి తెచ్చి పశ్చిమo టికెట్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించారని రాధా అనుమానిస్తున్నారు. వంగవీటి ని అవినిగడ్డ వెళ్లాలని జగన్ చెప్పడంతో టీడీపీలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. వంగవీటి వైసీపీ వీడటం తో, గుడివాడ తో సహా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ టీడీపీ కి అనుకూలమని రాజకీయ విశ్లేషకుల మాట.
- Tags
- వైసీపీ
Next Story

