Sat Apr 11 2026 05:07:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీకి కోలుకోలేని షాక్...మరో ఎమ్మెల్యే అవుట్

జగన్ పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు మళ్లీ తెరలేపింది. వైసీపీకి మరో షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి గెలుపొందారు. గతకొంతకాలంగా ఆమె పార్టీ మారతారని వినిపిస్తున్నా ఇప్పటి వరకూ ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే జగన్ పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ స్పీడ్ పెంచింది. వంతల రాజేశ్వరి మరికాసేపట్లో చంద్రబాబును కలిసి పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇది జగన్ కు కోలుకోలేని దెబ్బే. వంతల రాజేశ్వరి గతకొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ వేసినగాలానికి ఆమె పడిపోయారు.
- Tags
- వైసీపీ
Next Story

