Tue Apr 07 2026 05:42:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే అనుకున్నట్లే చేసేశారు

వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిపోయారు. కొద్దిసేపటి క్రితం ఆమె చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పేసుకున్నారు. గత కొద్ది రోజులుగా పాడేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరతారన్న ప్రచారాన్ని ఈరోజు నిజం చేశారు. చంద్రబాబు గిడ్డి ఈశ్వరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈశ్వరితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా టీడీపీలో చేరారు. గిడ్డి ఈశ్వరి పార్టీలో చేరడంతో ఇప్పటి వరకూ 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు టీడీపీలో చేరినట్లయింది. మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
- Tags
- వైసీపీ ఎమ్మెల్యే
Next Story

