Tue Mar 24 2026 18:19:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ తాజా ఆదేశమిదే..!

రేపు ఢిల్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లాలని ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశించారు. ఆరోతేదీన లోక్ సభ నిరవధికంగా వాయిదా పడుతుండటంతో వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఏపీ భవన్ లో ఆమరణ దీక్షకు దిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఎంపీలకు సంఘీభావంగా వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీ వెళ్లి ఒకరోజు దీక్షలో పాల్గొనాలని జగన్ ఆదేశించారు. అదే రోజున ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని జగన్ తాజాగా అందరికీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహారదీక్షలను వైసీపీ నేతలు ప్రారంభించనున్నారు.
Next Story

