Sat Apr 11 2026 22:57:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వెనక్కు తగ్గిన రేవంత్

టీటీడీఎల్పీ సమావేశంపై వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గారు. ఎమ్మెల్యేలెవరూ సహకరించకపోవడంతో ఆయన టీటీఎల్పీ సమావేశం ఆలోచనను విరమించుకున్నారు. టీటీఎల్పీ సమావేశాన్ని రద్దు చేశారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్యలు సమావేశానికి హాజరుకాబోమని స్పష్టం చేయడంతో రేవంత్ టీడీఎల్పీని రద్దు చేసుకున్నారు. గోల్కోండ హోటల్ లో టీడీపీ, బీజేపీ సమావేశం ఈ మధ్యాహ్నం జరగనుంది. ఈ సమావేశానికి రేవంత్ హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా ఉంది. రేవంత్ వ్యవహారంతోనే టీడీపీ అధిష్టానం రేవంత్అధికారాలను తొలగించిన సంగతి తెలిసిందే.
- Tags
- రేవంత్
Next Story

