Mon Apr 06 2026 00:57:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : విశాల్ నామినేషన్ తిరస్కరించిన అధికారిపై వేటు

ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. సినీ హీరో విశాల్ నామినేషన్ ను తిరస్కరించినందుకు ఆర్కేనగర్ రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని తొలగించింది. ఆయన స్థానంలో ప్రవీణ్ పి నాయర్ ను నియమించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో హీరో విశాల్ తో పాటు, జయలలిత మేనకోడలు దీప నామినేషన్లు తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ ఆరోపణలు వచ్చాయి. రాజీకీయ కారణాల వల్లనే తన నామినేషన్ ను తిరస్కరించారని విశాల్, దీపలు ఇరువురూ ఆరోపించారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని తొలగించింది.
- Tags
- ఆర్కేనగర్
Next Story

