Thu Mar 26 2026 23:05:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : లోక్ సభ రేపటికి వాయిదా

లోక్ సభ రేపటికి వాయిదాపడింది. సభ సజావుగా జరిగే అవకాశాలు లేకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. సభలో తెలుగుదేశం, వైసీపీ సభ్యులు వెల్ లోకి దూసుకు వచ్చి ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ సభ్యులు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కావేరీ జలాలపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ నినాదాలతో హోరెత్తిపోయింది. దీంతో లోక్ సభ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకూ వాయిదాలతోనే గడిచిపోతోంది. రాజ్యసభ మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా పడింది.
- Tags
- లోక్ సభ
Next Story

