Thu Apr 02 2026 06:56:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: లాలూ మూడున్నరేళ్లు జైల్లోనే...!

పశువుల దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు మూడున్నరేళ్లు జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది. రాంచీ సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాలూ కు శిక్ష ఖరారు చేసింది. 1991 నుంచి 1994 మధ్య కాలంలో లాలూ పశుగ్రాసం నిధులు దుర్వినియోగం చేశారు. దాణా ను పంపిణీ చేయకుండానే నిధులు నొక్కేశారని లాలూ పై ఆరోపణలున్నాయి. గత నెల 23న లాలూకు సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే ఈరోజు శిక్షను ఖరారు చేసింది. ఈ కుంభకోణం విలువ 930 కోట్ల రూపాయలు. లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నారని, శిక్ష తగ్గించాలని లాలూ తరుపున న్యాయవాదులు న్యాయమూర్తిని అభ్యర్థించారు.
Next Story

