Wed Mar 25 2026 21:31:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజ్యసభదీ అదే దారి

రాజ్యసభ కూడా ప్రత్యేక హోదా నినాదాలతో అట్టుడికి పోయింది. కొన్ని బిల్లులను ఆమోదించిన తర్వాత టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎంత చెప్పినా సభ్యులు విన్పించుకోలేదు. వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలంటూ వెంకయ్య నాయుడు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎవరూ మాట వినకపోవడంతో గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.
- Tags
- రాజ్యసభ
Next Story

