Thu Mar 26 2026 04:11:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజ్యసభ రేపటికి వాయిదా

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశం చర్చకు అనుమతించాలని సభ్యులు పట్టుపట్టారు. కేంద్రం తీరుపై కాంగ్రెస్ మండిపడింది. ప్రత్యేక హోదా, కావేరి జలాలు, బ్యాంక్ స్కామ్ లపై చర్చ జరగాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ పట్టుబట్టారు. సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తడానికి అధికార పార్టీ వైఖరే కారణమన్నారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు.
- Tags
- రాజ్యసభ
Next Story

