బ్రేకింగ్ : మోత్కుపల్లి vs రేవంత్

టీటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అర్థాంతరంగా ముగిసింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డికి, మోత్కుపల్లి నరసింహులుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అసలు కాంగ్రెస్ నేతలను ఎందుకు కలవాల్సి వచ్చిందని మోత్కుపల్లి రేవంత్ రెడ్డిని నిలదీశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కలిశావా? చంద్రబాబు అనుమతి తీసుకున్నావా? పొత్తుల విషయంపై కాంగ్రెస్ నేతలతో మాట్లాడటానికి నీవెవరివి? అని నిలదీశారు. అయితే రేవంత్ రెడ్డి దీనిపై ఘాటుగానే స్పందించారు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. మోత్కుపల్లికి అంత స్థాయి లేదని కూడా ఆవేశంగా అన్నారు. మరోనేత అరవిందకుమార్ రెడ్డి కూడా నిలదీయడంతో మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని, తాను ఏదైనా ఉంటే చంద్రబాబు తోనే మాట్లాడతాననిచెప్పి వెళ్లారు. దీంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు. అయితే టీటీడీపీ నేతలు మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపేతం, అసెంబ్లీ సమావేశాలపై చర్చించామని చెప్పడం కొసమెరుపు. మొత్తం మీద టీటీడీపీ పార్లమెంటరీ సమావేశం హాట్ హాట్ గా సాగింది.

