Sun Mar 29 2026 22:48:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మోడీకి ఇరకాటం తప్పదా?

లోక్ సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ విభజన చట్టం, ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ పార్టీ నోటీసు జారీ చేసింది. 184 నిబంధన కింద చర్చ, ఓటింగ్ జరపాలని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నోటీసులు ఇచ్చారు. 184 నిబంధన కింద నోటీసు ఇస్తే ఖచ్చితంగా చర్చతో పాటు ఓటింగ్ జరపాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏలో చీలికలు తెచ్చేందుకు కాంగ్రెస్ ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఇక రాజ్యసభలో కూడా రగడ జరుగుతూనే ఉంది. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా వేశారు. టీడీపీ ఎంపీలు ఈరోజు కూడా నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. గోవిందా...గోవిందా అంటూ నినాదాలు చేస్తున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
- Tags
- మోడీ
Next Story

