Wed Apr 01 2026 14:12:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మరి కాసేపట్లో చీఫ్ జస్టిస్ మీడియా సమావేశం

మరికాసేపట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా కూడా మీడియా ముందుకు రానున్నారు. నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల చేసిన ఆరోపణలపై ఆయన స్పందించనున్నారు. ఇప్పటికే ఆయన అటార్నీ జనరల్ తో ఈ విషయం మాట్లాడినట్లు తెలిసింది. నలుగురు న్యాయమూర్తుల మీడియా సమావేశంపై ప్రధాని మోడీ కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఆయన న్యాయశాఖ మంత్రితో చర్చించారు. మొత్తం మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీడియా సమావేశంలో ప్రకంపనలు రేపుతోంది. నలుగరు న్యాయమూర్తులతో మరు ఇద్దరు జడ్జిలు కూడా కలిసి తమ మద్దతును ప్రకటించారు.
- Tags
- చీఫ్ జస్టిస్
Next Story

