Mon Mar 30 2026 08:05:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మనోళ్లదే ప్రపంచకప్....!

ప్రపంచ కప్ ఫైనల్లో కుర్రోళ్లు సత్తా చాటారు. ఆస్ట్రేలియాపై విజయం సాధించారు. ఆస్ట్రేలియాతో జరగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ విజయం ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి ఫీల్డింగ్ దిగిన భారత్ ఆసీస్ బ్యాట్స్ మెన్లపై తమ ప్రతాపం చూపారు. 47.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియ జట్టు మొత్తాన్ని పెవిలియన్ దారి పట్టించారు. 217 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 71 పరుగుల వరకూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మంజోత్ కల్రా సెంచరీ చేశారు. తర్వాత రెండు వికెట్లు పడినా అనుకున్న విజయలక్ష్యాన్ని సాధించారు. అండర్ 19 ప్రపంచ కప్ భారత్ వశమయింది. ఇప్పటికి మూడుసార్లు భారత్ ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ నాలుగో సారి కూడా ప్రపంచ కప్ ను చేజిక్కించుకున్నట్లయింది. మరో 11 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కించుకుంది.
Next Story

