Fri Mar 27 2026 07:21:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారీగా వ్యవ‘‘సాయం’’

ఏపీ బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు అధిక నిధులను కేటాయించారు. సంక్షమ రంగం తర్వాత వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయరంగానికి 12,355 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు మంత్రి యనమల తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రభుత్వం రైతు సమస్యల పట్ల చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు. రైతులకు సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడమే కాకుండా పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు యనమల చెప్పారు. రైతుల సంక్షేమమే ఏపీ ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు వెళుతుందని చెప్పారు.
Next Story

