Sun Mar 29 2026 05:45:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పవన్ జేఏసీపై బాబు స్పందన ఇదే....!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటంలో అర్థముందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ జేఏసీ విషయం ప్రస్తావన వచ్చింది. పవన్ జేఏసీతో మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని చంద్రబాబు నేతలతో అన్నారు. రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆకాంక్షతోనే పవన్ జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. పవన్ అడిగిన శ్వేతపత్రంపై సున్నితంగా స్పందించాలని చంద్రబాబు నేతలకు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో బీజేపీయే పవన్ కు సమాచారం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పవన్ జేఏసీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణతో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Next Story

