Mon Apr 06 2026 09:24:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పందెంకోడికి ఈసీ షాక్

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో హీరో విశాల్ కు చుక్కెదురైంది. విశాల్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. నిన్ననే ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి హీరో విశాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ పత్రాలను నిబంధలను అనుసరించి పూర్తి చేయకపోవడంతో తరిస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు జయలలిత మేనకోడలు దీప నామినేషన్ ను కూడా అధికారులు తిరస్కరించడం విశేషం. నామినేషన్ల పత్రాల్లో తప్పులు ఉండటమే తిరస్కరణకు కారణమని తెలుస్తోంది.
- Tags
- విశాల్
Next Story

