Sat Apr 04 2026 22:27:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా

టీడీపీకి మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉమా మాధవరెడ్డితో పాటు కుమారుడు సందీప్ రెడ్డి కూడా రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పార్టీని వీడాల్సి వస్తుందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో తమకు ఉన్నతమైన పదవులు ఇచ్చారన్నారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్లు ఉమా మాధవరెడ్డి తెలిపారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు పార్టీలో ఉన్న పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్ రెడ్డి రేపు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
- Tags
- టీడీపీ
Next Story

