Tue Apr 07 2026 12:53:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీ కండువా కప్పేసుకున్నారు

టీడీపీలో నల్లారి కుటుంబం చేరిపోయింది. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఆయన తనయుడు అమర్ నాధ్ రెడ్డి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. కిశోర్ కుమార్ రెడ్డి వెంట 70 మంది సర్పంచ్ లు, ఎంపీటీసీలు టీడీపీలో చేరిపోయారు. వీరందరినీ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిక సందర్భంగా పెద్ద సంఖ్యలో అనుచరులు అమరావతికి తరలి వచ్చారు.
- Tags
- టీడీపీ
Next Story

